13 May, 2026 | 7:20 PM

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బోధన్ ఆర్డీవో

13-05-2026 06:14 PM

- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బోధన్ ఆర్డీవో ఎమ్ .విజయ కుమారి పరిశీలించారు

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలం కల్దుర్కి, సాలురా మండలం హున్సా, రెంజల్ మండలలోని కందకుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బోధన్ ఆర్డీవో ఎమ్.విజయ కుమారి బుధవారం రోజున మధ్యాహ్నం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుతున్న సౌకర్యాలు కొనుగోలు విధానం తూకం ప్రక్రియ, నిల్వ ఏర్పాట్లు రవాణా సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ తహశీల్దార్ విట్టల్, ఆర్ఐ గంగాధర్ పాల్గొన్నారు.