20 May, 2026 | 6:21 PM

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

20-05-2026 05:09 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం   జొన్న పంట కొనుగోలు కోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మల్లూరు సహకార సంఘ పరిధిలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘ అధ్యక్షులు కళ్యాణి విఠల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, సర్పంచులు, బొజ్జ అంజయ్య, పోచయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.