ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ భవన్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బోనగిరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా దూడ సందీప్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా చీకటి తిరుపతి, కోశాధికారిగా వొజ్జల(చింతల) శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా బోనగిరి మహేష్, ఉపాధ్యక్షులుగా కొండజీ శ్రీనివాస్, బోరె రమేష్, ప్రధాన సలహాదారులుగా నేరెళ్ల లక్ష్మీ రాజం, సలహాదారులుగా మల్యాల సంతోష్, పిట్టల రాకేష్, ప్రచార కార్యదర్శిగా చీకటి సాయి కిరణ్ లను ఎన్నుకున్నారు.
2026 నుంచి 2028 వరకు నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గానికి పలువురు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పని చేసే పాత్రికేయులు తమ జీవితంలో ఎదురయ్యే కష్ట, నష్టాలకు బెదిరిపోవద్దన్నారు. మహాత్మ గాంధీ చెప్పినట్లు సేవా గుణంతో పాత్రికేయులుగా పని చేయాలని నూతన కమిటీకి, సభ్యులకు సూచించారు.సమాజం కోసం పని చేసే క్రమంలో ఎన్నో రకాల ఇబ్బందులుంటాయని తెలిపారు. పాత్రికేయునిగా మన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తే సమాజ సేవ చేసినట్లేనని మార్గ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తిరుపతి, ప్రసాద్, శ్రీనివాస్, రాజశేఖర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.






