20 May, 2026 | 6:32 PM

మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్

20-05-2026 05:12 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా స్వామి జిల్లా నాయకులు కారం రవిలు విమర్శించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... 10 శాతం ఉన్న. మాదిగలకు ఒక్క మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో 23 మండలాలు ఉండగా ఒక్క మండలానికి కూడా. మాదిగలకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తపరిచారు.

గతంలో బిఆర్ఎస్ పార్టీ మాదిగలను చిన్న చూసిందని కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తుందన్నారు. మాదిగలను వాడుకుంటూ మోసం చేసిన పార్టీలకు తగు బుద్ధి చెప్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మాదిగ జాతి నాయకులు ఆత్మ గౌరవం ఉంటే వెంటనే ఆ పార్టీకి రాజీనామాలు చేయాలని కోరారు. రాజీనామాలు చేసి  ఆత్మ గౌరవాన్ని కాపాడుకొని సమాజంలో తలెత్తుకు తిరగాలని వారు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు  అన్నెపాగ అశోక్, సుభాష్ అరవింద్ తదితరులు ఉన్నారు.