జొన్న కొనుగోళ్లు ప్రారంభం
10-06-2026 01:46 AM
కుబీర్ (విజయక్రాంతి): బైంసా డివిజన్లో యాసంగి సీజన్లో రైతులు పండించిన జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కుబీర్ తానూర్ ముధోల్ బైంసా కుంటాల కేంద్రాలు ప్రారంభం కాక పంట పండించిన రైతులు టోకెన్లు తీసుకొని పంటను ప్రత్యేక ట్రాక్టర్లను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ట్రాక్టర్ల క్యూ కనిపిస్తోంది. వేగంగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. జొన్న పంటకు ప్రభుత్వం మద్దతు ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని పంటను విక్రయించుకునేందుకు ముగ్గు చూపుతున్నారు.






