12 July, 2026 | 6:34 PM

నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం

12-07-2026 05:28 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావులపల్లి నరసింహారావు ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు సమక్షంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడు రావులపల్లి నరసింహారావును శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు చురుకైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. అనంతరం రావులపల్లి నరసింహారావు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబుకు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాల సాధనతో పాటు ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.