ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్
12-07-2026 05:13 PM
బోథ్,(విజయక్రాంతి): గుడేహత్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ తరఫున నియమితులైన అబ్జర్వర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్ గురుజ గ్రామాలలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును సైతం పరిశీలించి ఓటర్ నమోదు వివరాలు సవరణ మార్పులు చేర్పులపై అవగాహన కలిగించారు. అర్హుడైన ప్రతి వ్యక్తి పేరు ఓటర్ జాబితాలో ఉండాలని కోరారు. ఆయన వెంటూరు మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తులసందరావు శాంతాపూర్ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.






