పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం
12-07-2026 05:16 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రఘుపతి ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయనను విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రంగు రాజు మాట్లాడుతూ... పదవీ విరమణ పొందిన మీరు సమాజ సేవకు కృషి చేయాలని కోరారు. అంతేగాక ఉపాధ్యాయునిగా సమాజానికి అవసరమైన సూచనలు సలహాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పాపేష్ రూపేష్ పాలిక్ రమేష్ పాలిక్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






