12 July, 2026 | 6:23 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు

12-07-2026 05:19 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజున జెట్టక్కను గ్రామస్థులందరు కలిసి తరిమికొట్టారు. గ్రామ సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ ఛైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ... గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో వర్షాలు సమృద్ధిగా కూరవలని జెట్టక్కను తిరిమికొట్టమని అన్నారు. వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

వర్షాలు సమృద్ధిగా కూరవలని కోరుకుంటూ గ్రామంలోని జెట్టక్కను అనగా దరిద్ర దేవతను గ్రామంలో నుండి వెల్లగొట్టలనే ఉద్దేశంతో ఇంట్లోని పాతవస్తువులను బట్టలను చీపురు కట్టలను చటలను ఇతర వస్తువులను డప్పుల మోతలతో గ్రామ శివారు వరకు ర్యాలీగా వెళ్లి పడేయడం జరిగిందని అలాగే ట్రాక్టర్ల ద్వారా పాతవస్తులను తరలించడం జరిగిందని అన్నారు.

గ్రామంలోని నాయకులు ప్రజలు పాతవస్తువులతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ జెట్టక్కను సాగనాంపరు.జెట్టక్క దరిద్ర దేవత బయటకు వెళ్లి లచ్చక్క అనగా లక్ష్మీదేవి గ్రామంలోకి రావాలని  వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని కోరుకున్నట్టు తెలిపారు. వర్షాలు కూరవలని కప్పతల్లి ఆట వరుణ యాగం కూడా చేస్తామని అన్నారు.