పేదల ముఖాల్లో పండుగ వెలుగులు
18-03-2026 12:44 PM
నిజాంసాగర్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ....
నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్(Nizamsagar) మండలం లోని బంజపల్లి గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా(Ramzan Tohfa) ను స్థానిక సర్పంచ్ ఏలే సుగుణమ్మ,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందించారు. ప్రతి ఒక్కరూ మతసామరస్యాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ భుజంగరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




