ఈ-నామ్ 2.0 ఇబ్బందులు తీర్చండి
28-02-2026 12:57 AM
- ఈ-నామ్ జాయింట్ సెక్రటరీని కోరిన ఎంపీ అర్వింద్
- ప్రస్తుత సీజన్ ముగిసే వరకు ఈ నామ్ 1.0 ద్వారా కొనుగోళ్లు
నిజామబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఈ-నామ్ 2.0 ద్వారా జరుగుతు న్న కొనుగోళ్ల జాప్యంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఈ నామ్ 2.0 వెర్షన్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఢిల్లీలోని సంబంధిత ఈ నామ్ జాయింట్ సెక్రటరీ చిన్మయి గోత్మారేతో ఫోన్‌లో మాట్లాడి రైతులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈనామ్ 2.0 లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను సత్వరమే పరిష్కరిం చాలని, ప్రస్తుత సీజన్ ముగిసే వరకు ఈ నామ్ 1.0 ద్వారానే పసుపు కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. దీనిపై జాయింట్ సెక్రెటరీ గోత్మారే స్పందిస్తూ.. ఈ నామ్ 2.0లో గల సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తామని, అప్పటివరకు ఈ నామ్ 1.0 ద్వారానే కొనుగోలు జరిగేలా తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.




