నరేంద్ర మోదీ 'జనాగ్రహ సభ'ను విజయవంతం చేయండి
డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి
అబద్ధపు హామీలతో ప్రజలు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్ధికి నిబద్ధతతో కృషి: ఎంపీ డీకే అరుణమ్మ
గద్వాల: ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బీజేపీ 'జనాగ్రహ సభ'ను జయప్రదం చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ అన్నారు. శనివారం గద్వాలలో పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డికె. అరుణమ్మ మాట్లాడుతూ మూడవ సారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సారి తెలంగాణకి వస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికారం కోసం అబద్ధపు హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఎంపీ మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకే 'జనాగ్రహ సభ' నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తుంది.
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోనూ పార్టీ బలపడుతోందని, అస్సాం, పుదుచ్చేరిలో సానుకూల వాతావరణం ఉందన్నారు.గ్రామాలలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వా నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థులు బలిగేరా శివా రెడ్డి, రాజగోపాల్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు దాస్ తదితరులు హాజరయ్యారు..






