26 February, 2026 | 1:58 AM

నాగరాల గ్రామం రెండవ సెంటర్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం

26-02-2026 12:00 AM

శ్రీరంగపురం ఫిబ్రవరి 25:నాగరాల గ్రా మం రెండవ సెంటర్లో గత పదేళ్లుగా తాగునీటి సమస్య తీవ్రంగా కొనసాగుతోంది. ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ గుంటి మహదేవ్ సాగర్ ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఇబ్బందులను సవివరంగా వివరించిన సర్పంచ్ మహాదేవ్ వినతికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తక్షణమే స్పందించారు.రెండవ సెంటర్లో తాగునీటి కొరత లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సర్పంచ్ మహాదేవ్ ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యే సూచనల మేరకు ఈరోజు రెండవ సెంటర్లో కొత్త బో రు తవ్వకాలు ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రాంత ప్రజలకు స్థిరమైన తాగునీటి సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.స్థానికులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, పదేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నిరంతరం ప్రజల తరఫున పోరాడుతున్న సర్పంచ్ మహదేవ్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.