14 May, 2026 | 2:25 AM

ఘన వ్యర్ధాల నిర్వహణ నియమాలు తప్పక పాటించాలి

14-05-2026 01:25 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 13 (విజయక్రాంతి) : భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు, నూతన ఘన వ్యర్ధాల నిర్వహణ నియమాలు  2026 తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సాలిడ్ వేస్ట్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశములో ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి, ఘన వ్యర్ధాల నిర్వహణకు శానిటేషన్ ప్లాన్ ను గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు ప్రతిపాదనలు సిద్దం చేసి వచ్చే 15 రోజుల్లోగా యాక్షన్ ప్లాన్ సమర్పించాలన్నారు.

ప్రతి వ్యర్థ ఉత్పత్తిదారుడు ఘన వ్యర్ధాల వల్ల పర్యావరణ కాలుష్యం కలగకుండా నివారించుటకు, తగ్గించుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను ఉత్పత్తి అయ్యే చోటనే నాలుగు వేర్వేరు విభాగాలుగా తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక జాగ్రత్త అవసరమైన వ్యర్ధాలుగా వేరు చేయాలన్నారు. ఈ వ్యర్ధాలను వ్యర్ధ నిర్వహణ కేంద్రానికి గాని, చెత్త వాహనమునకు గాని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో శిరీష, డిఆర్డిఓ పిడి సన్యాసయ్య, డిపిఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ లు సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాసు, తదితరులు ఇతర అధికారులు పాల్గొన్నారు.