అటవీశాఖ ఆధ్వర్యంలో సోలార్ దీపాలు ఏర్పాటు చేయడం అభినందనీయం
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఇందర్గాం, రేచిని, గబ్బాయి, తలాయి గ్రామాలలో సోలార్ దీపాలను ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. మారుమూల గ్రామాల అభివృద్ధిపై అటవీ శాఖ కూడా కృషి చేస్తుందని తెలిపారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు పెట్టడం తో వన్యప్రాణులకు, జీవవైవిద్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు.
అడవిలో ఎవరైనా నిప్పు పెడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో సోలార్ దీపాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కృష్ణ పల్లి సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ,వార్డ్ సభ్యులు,సెక్షన్ అధికారి సఫియా బేగం, బీట్ అధికారులు స్రవంతి, వెంకటేశం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




