అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం
నాగిరెడ్డిపేట్, జూన్ 18 (విజయక్రాంతి): మండలంలోని రాఘవపల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి ట్రాక్టర్,జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.ఆయన వివరాల ప్రకారం, జూన్ 17 రాత్రి సుమారు 10 గంటల సమయంలో రాఘవపల్లి గ్రామ శివారులో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక జాండీర్ ట్రాక్టర్, ఒక జేసీబీతో మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు.ట్రాక్టర్ డ్రైవర్ నార్ల మహేష్ (రాఘవపల్లి), జేసీబీ డ్రైవర్ నీల నారాయణ (దేవునిపల్లి)లను విచారించగా, వారి వద్ద తవ్వకాలకు సంబంధించిన ఎలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేవని తేలినట్లు ఎస్‌ఐ తెలిపారు.దీంతో వాహనాలను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ వెల్లడించారు.






