25 March, 2026 | 5:57 PM

Breaking News

భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలి

25-03-2026 04:06 PM

వారంలో రెండు రోజులు సేవలు అందుబాటులో

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎల్లారెడ్డిపేటలో భవిత కేంద్రం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): దివ్యాంగ విద్యార్థులు భవిత కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో భవిత కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. భవిత కేంద్రం పరిధిలో మొత్తం ఎందరు దివ్యాంగులు ఉన్నారు? ఏ ఏ సేవలు వారికి అందిస్తారో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో భవిత కేంద్రం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీని సేవలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి బుధవారం, గురువారం ఐఈఆర్పీ, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అనంతరం మండల సమాఖ్య భవనాన్ని పరిశీలించి, ఎందరు సభ్యులు ఉన్నారని, స్వయం ఉపాధి, సంఘాల ఆర్థిక కార్యకలాపాలపైన ఆరా తీశారు. అక్కడి నుంచి జూనియర్ కళాశాల మైదానంలో పనులను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, ఎంఈవో కృష్ణహరి, తదితరులు పాల్గొన్నారు.