మంత్రి తుమ్మల కనుసన్నల్లో మట్టి, ఇసుక మాఫియా!
- సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పువ్వాడ
- ఆరు అడుగుల కటౌట్లా నిటారుగా ఉన్నా..
- ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తా: పువ్వాడ
ఖమ్మం, జులై 27(విజయక్రాంతి): గతంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారే ఇప్పుడు అరాచకాలు చేస్తున్నారు. స్వయానా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మట్టి , ఇసుక మాఫీయాను నడిపిస్తున్నారు. మేమే చేసిందంతా మాఫీయా, మేము సుద్ద పూ సలం, మా ప్రభుత్వం వస్తే మాఫీయా ను అ రికడతాం అని నీతులు చెప్పిన వారే తప్పు లు చేస్తున్నారు. తుమ్మల సమక్షంలోనే ఇసు క, మట్టి మాఫీయా ముమ్మరంగా కొనసాగుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజ య్ కు మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లో బీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగిం ది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమా ర్ తుమ్మల నాగేశ్వరరావు పై ధ్వజమెత్తారు. తనపై గతంలో అరాచకాలు, అక్రమాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేసిన వారు, ప్రస్తుతం అదే తరహా అరాచకాలు, మాఫి యా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రఘునాథపాలెం మండలంలో అనేక మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి దోచుకుంటూ, ఇసుకమట్టి మా ఫియాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి తు మ్మలపై విమర్శలు గుప్పించారు.
తన ఆరోగ్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను ఆరు అడుగుల కటౌట్లా నిటారుగా నిలబడి ఉన్నానని, ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానా లు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్ర జలే చరమగీతం పాడతారని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రజలతో కలిసి నిరంతరం పోరాటం కొనసాగిస్తానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఆరు అడుగుల కటౌట్ ఇలాగే ఉంది: మాజీ మంత్రి
పువ్వాడ పని అయిపోయింది అన్నావు.. అంబులెన్స్ దిక్కు అన్నావు.. కానీ వ్యవసాయ శాఖ మంత్రి.. మీ ముందు ఆరు అడుగుల కటౌట్ లాగా నిటారుగా నిలబడి ఉన్నా, పోరాటాల స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలబడి ఉంటా, జిల్లా ప్రజల కోసం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమగీతం పాడి కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చేదాకా బతికే ఉంటా అని పువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ప్రజలందరు బీఆర్‌ఎస్ వస్తుందని చెబుతున్నా రని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేడీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






