calender_icon.png 23 February, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజం చరిత్రపై ఆధారపడి ఉంది

23-02-2026 12:18:17 AM

కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 

కాకతీయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి) : సమాజం చరిత్రపై ఆధారపడి ఉందని, విలువలను మనం చరిత్ర నుంచే గ్రహించాలని, మనకు మార్గదర్శనం చేసేది చరిత్రే అని కేయూ వైస్ చాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.

కేయూ హ్యూమానిటీస్ బిల్డింగ్ సెమినార్ హాల్లో యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్ అధ్యక్షతన తెలంగాణ  హిస్టరీ కాంగ్రెస్ 9వ వార్షిక సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు.  చరిత్రకు అనేక సజీవ సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని వెలికితీసి ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్ర ద్వారా ఆనాటి జీవన విధానం, ప్రజల సంస్కృతి, వారసత్వం గురించి అవగాహన పొందవచ్చని తెలిపారు.

మానవ పరిణామ క్రమంలో సంభవించే మార్పులను చరిత్ర ద్వారానే సరిగా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు పరిశోధనలపై మరింత దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ఆచార్య ఈ. సుధారాణి, జనరల్ సెక్రటరీ అంకం జయప్రకాశ్, విభాగాధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, వ్యవస్థాపక అద్యక్షులు ఆచార్య వెంకట్రాజం, ఆచార్య కే. విజయ బాబు, ఆచార్య వరలక్ష్మి, డాక్టర్ గాజుల దయాకర్, డాక్టర్ బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చరిత్రకారులు, ప్రముఖ చరిత్ర అధ్యాపకులు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించారు.