12 June, 2026 | 4:02 AM

విద్యతోనే సామాజిక మార్పు

12-06-2026 01:30 AM

అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం

విద్యా ప్రమాణాల పెంపునకు ప్రాధాన్యం

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను సామాజిక మార్పుకు ప్రధాన ఆయుధంగా భావిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డ్డబ్ల్యూఆర్‌ఈఐఎస్) మూడవ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం గురువారం సచివాలయంలోని మంత్రి మాట్లాడుతూ విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఉపాధ్యాయ సంక్షేమం, ఉన్నత విద్య అవకాశాల విస్తరణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

ఆమోదించిన అంశాలు.. ‘ డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగం ఏర్పాటు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు. డిగ్రీ కళాశాలలకు న్యాక్ గుర్తింపు సాధించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఉన్నత విద్య కోసం దేశ, విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్, ఆర్థిక సహా యం. 9వ తరగతి నుంచే నీట్, జేఈఈ వం టి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈసీ) ప్రారంభించాలని నిర్ణయం.

క్రాఫ్ట్ టీచర్లు, ఆర్ట్ టీచర్లను టీజీటీలుగా గుర్తించే ప్రతిపాదనకు ఆమోదం. సెలవు రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఫోన్ మిత్ర సౌకర్యం ఏర్పా టు. రాష్ట్ర కార్యాలయంలో భర్తీ చేసే పోస్టులకు రోస్టర్ విధానం అమలు, భవిష్యత్ ఉ పాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణ యం.హైదరాబాద్‌లో టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఆధ్వర్యంలో ఫార్మసీ కళాశాల స్థాపన.

గురుకుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఫౌండేషన్ సెంటర్లను బలోపేతం చేయడం, అదనపు సబ్జెక్ట్ నిపుణులను నియమించడం. క్రీడలు, వృత్తి విద్య అభివృద్ధి కోసం స్పోర్ట్స్ కోచ్ లు, వొకేషనల్ లెక్చరర్ల సేవలను కొనసాగించడం.  విద్యార్థుల పోషకాహార ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని గురుకులాల్లో ఉమ్మడి మెనూ అమలు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల పారితోషికాల పెంపు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మాణం చేపట్టాలి.