2 March, 2026 | 1:56 PM

రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి

02-03-2026 12:21 AM
  1. పదేళ్ల కేసీఆర్ పాలనలో నిధులు ఇవ్వలే

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో అన్ని చెరువులు నింపుతాం

రాములబండలోని శివాజీ విగ్రహావిష్కరణ, 

సీతారామచంద్ర స్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి

నల్లగొండ టౌన్, మార్చి 1: వచ్చే రెండేళ్లలో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి నిరంతరం సాగునీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నాకు మంచి పేరు వస్తుందని పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్‌ఎల్బీసీకి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు ఆదివారం నల్గొండ మండలంలోని రాముల బండ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.

గ్రామస్తులతో కలిసి రథోత్సవంలో రథాన్ని లాగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండగలు గ్రామస్తుల మధ్య ఐక్యత, అనుబంధాలను మరింత పెంచుతాయని అన్నారు *ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సీతారాములను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా మూడు నెలల్లో అన్ని చెరువులను నింపి ప్రతి ఎకరాకు నిరంతమన్నారు అన్ని కాలువలకు లైనింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. దోమలపల్లి, రాములబండ, కాకుల కొండారం, దీప కుంట చెరువులను నింపడంతో పాటు కాలువల లైనింగ్ లు కూడా పూర్తి చేస్తానని అన్నారు దోమలపల్లి చెరువు రూ.10 కోట్లతో లిఫ్టు ఏర్పాటు చేశామన్నారు నల్గొండ నుంచి మునుగోడుకు రూ.150 కోట్లతో డబల్ రోడ్డుకు పది రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు.

రాములబండ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించి భూముల పరిరక్షించడం జరుగుతుందని అన్నారు దేవాలయానికి సంబంధించిన భూముల కౌలును దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వెంటనే చర్యలు తీసుకుంటానని తెలిపారు

శివాజీ విగ్రహావిష్కరణ

ఈ సందర్భంగా చిత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి ఆవిష్కరించారు శివాజీ చూపిన మార్గంలో యువత నడుచుకోవాలి అన్నారు వీరత్వానికి పౌరుషానికి శివాజీ ప్రతికగా నిలిచాడని వివరించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్, బొబ్బలి ప్రకాశ్ రెడ్డి, దేవాలయ ధర్మకర్తలు, గ్రామపంచాయతీ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు