యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట, మార్చి 1 : ఆదివారం సెలవు కావడంతో యాదగిరిగుట్ట కొండపైకి భారీగా భక్తులు తరలివచ్చారు. నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను వేదమంతోత్సవములు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు. ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు.
భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కలను చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీ రామలింగేశ్వర శివాలయంలో నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలను పండితులు నిర్వహించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర సమాచార చట్ట కమిషనర్ బో రెడ్డి అయోధ్య రెడ్డి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణ కి కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్ ఆధ్వర్యంలో దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వచనం చేసిన వేద పండితులు స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు.




