7 April, 2026 | 6:18 PM

ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్

07-04-2026 04:20 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ లేబర్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ లేబర్ యూనియన్. ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్‌ గా ఎస్కె బాజీ సాహెబ్ ని నియమిస్తూ నియామక పత్రాన్ని ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డాక్టర్ జనక్ ప్రసాద్ అందజేశారు.

సత్తుపల్లి ఏరియాకు వైస్ ప్రెసిడెంట్‌ గా నియమితులైన సందర్భంగా ఎస్.కె బాజీ సాహెబ్  మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గౌరవ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డికి , అధ్యక్షులు శ్రీ జనక్ ప్రసాద్ కి, స్థానిక ఎమ్మెల్యేకి, జనరల్ సెక్రెటరీ ధర్మపురి కి, రీజినల్ ఇంచార్జ్ ఆల్బర్ట్ కి, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.