7 April, 2026 | 7:18 PM

శివ కుటుంబానికి హామి

07-04-2026 05:38 PM

ముకరంపుర,(విజయక్రాంతి): వీధి దీపాల నిర్వహణ విధుల్లో గత పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన లైన్ మెన్ శివను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మరోసారి పరామర్శించారు. ​లైన్ మెన్ శివ ఆరోగ్య పరిస్థితి గాయలకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్ తో మేయర్ కొలగాని శ్రీనివాస్ చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని,  వైద్యులకు సూచించారు.

దీంతో వైద్యులు శివ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రస్తుతం గాయాలకు మెరుగైన చికిత్స చేశామన్నారు. ఈ రోజు హాస్పిటల్ నుండి డిచార్జ్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. అనంతరం బాధితుడి తల్లిదండ్రుల తో మేయర్ మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, శివ పూర్తి స్థాయిలో కుదుట పడే వరకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమం లో కార్పొరేటర్లు మేకల వెంకటేష్, చంద్రా మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.