కేకేఓసీపీనీ సందర్శించిన కార్పొరేట్ జీఎం(సేఫ్టీ) సాయిబాబా
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ కార్పొరేట్ జీఎం (సేఫ్టీ) సాయిబాబు మంగళవారం మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ను ఏరియా జనరల్ మేనేజర్ N.రాధాకృష్ణ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గని లోపలికి వెళ్లి క్వారీలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (OB) తొలగింపు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గనిలో ప్రస్తుత పనితీరును సమీక్షించిన అనంతరం, అధికారులు, కార్మికులకు ఆయన పలు భద్రతా సూచనలు చేశారు.
ఉత్పత్తి కంటే రక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గనిలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట జీ.ఎం (సేఫ్టీ), బీ.పీ.ఏ రీజియన్ కే.రఘు కుమార్, ఎస్.ఓ టూ జీ.ఎం లలితేంద్ర ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO), కే.కే ఓ.సీ.పీ. ఎం మల్లయ్య, సేఫ్టీ ఆఫీసర్ (KKOCP) ఎన్. పైడయ్య, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎన్. వెంకట వంశీధర్, ఇన్‌చార్జ్ మేనేజర్ శ్రీధర్ గౌడ్,అధికారులు కార్మికులు ఉన్నారు.




