7 April, 2026 | 8:11 PM

రసాయన శాస్త్ర ఆధ్వర్యంలో సూక్ష్మ అధ్యయన విశ్లేషణ

07-04-2026 06:07 PM

మకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్లోని స్థానిక ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల కార్యశాల అనువుల యొక్క స్పెక్ట్రా మరియు నానో మెటీరియల్ సూక్ష్మ అధ్యయన విశ్లేషణ గూర్చి జరిగిన కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ఉమేష్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ అణువుల యొక్క నిర్మాణం గూర్చి తెలియని అణువుల నిర్మాణాలను సమూహంలో గల అణువుల సంఖ్యను సమూహంలోని మలిన సమూహ, సంబంధము కాని అణువుల గుర్తింపులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని యువత పరిశోధనల వైపు ప్రయోగాలపై దృష్టి సారించాలని తెలియజేశారు, కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ జి విజయలక్ష్మి, డాక్టర్ ఎం సరసిజా శాతవాహన యూనివర్సిటీ, డాక్టర్ ఆర్ మధు లు పాల్గొని విస్తృత ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగాధిపతి మేజర్ ఆర్ సంజీవ్, టీ కరుణాకర్, డాక్టర్ ఏ శంకరయ్య, పి రాజేష్, డాక్టర్ కే సునీత, ఐ గోపి కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.