7 April, 2026 | 7:45 PM

నగరంలోని 19వ డివిజన్లో ఆరోగ్య పరీక్షలు

07-04-2026 05:48 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  కరీంనగర్ 19వ డివిజన్  లోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బిపి ,షుగర్ పరీక్షలు నిర్వహించి డివిజన్ ప్రజలకు ఉచితంగా మందులు అందించారు .ఈ కార్యక్రమనికి 19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్ హాజరై శిబిరంను ప్రారంభిచారు.

వారు మాట్లాడుతూ... మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మంచి అలవాట్లు పెంపొందించుకొందాం శారీరక శ్రమకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యంగా జీవిద్దాం.అని  డివిజన్ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకొంటూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ వైద్య అధికారి రాజ్ కుమార్ ఏఎన్ఏం విజయ రాణి ఆర్పీ విజయ రోజా ఆశా వర్కర్లు నవ్య కవిత కవిత సిబ్బంది డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.