మెడికల్ హెల్త్ క్యాంప్
07-04-2026 05:35 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ లో లైన్స్ ఇంటర్నేషనల్ 320జి డాక్టర్, ఎం ఎల్ ఎన్ రెడ్డి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ చెకప్ క్యాంపు బీపీ, షుగర్, టూడి, ఏకో, జనరల్ చెకప్ డాక్టర్లచే నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ సింహరాజు కోదండరాం, మొదటి ఉపగవర్నర్ మోరె భద్రేశమ్, డిసిఎస్ వాసుదేవ రెడ్డి, డిసి టిగాలిపల్లి వెంకట్, రాజరాజేశ్వరి లైన్స్ క్లబ్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండకిషన్ రెడ్డి, ఆర్ఎస్పి రెడ్డి, శాతవాహన, బాలాజీ నగర్, మానేర్ మరియు క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు.




