7 April, 2026 | 7:44 PM

జుక్కల్ ఎమ్మెల్యేను సన్మానించిన డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్

07-04-2026 06:05 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కేరళ రాష్ట్రంలోని అడూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ పరిశీలకులుగా పర్యటించి తిరిగి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంగళవారం నాడు జుక్కల్‌లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అడూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమీక్షించి విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకున్న తోట లక్ష్మీకాంతరావు, తిరిగి నియోజకవర్గానికి  చేరుకోవడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని, మారు పూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యునికి  ఏఐసీసీ పరిశీలకునిగా నియమించడం  ఆయన పనితీరుకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు