13 March, 2026 | 11:45 PM

నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన

13-03-2026 10:25 PM

- విద్యార్థులకు విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్యం తప్పనిసరి

- టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి: విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎదగాలంటే విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఎంతో అవసరమని అందుకు కల్వకుర్తి కేంద్రంగా నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిఓఓ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల సమావేశ హాల్లో స్థల పరిశీలన చేపట్టారు. విద్యార్థులకు టెన్త్ ఇంటర్ తర్వాత కంప్యూటర్ కోర్స్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందుబాటులో ఉంచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు టాస్క్ రీజనల్ కోఆర్డినేటర్ సనీల్ రెడ్డి, రవికుమార్ నేతలు ఆనంద్ కుమార్, శానవాజ్ ఖాన్ తదితరులు.