18 May, 2026 | 4:13 PM

జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

18-05-2026 02:56 PM

నిర్మల్ మే 18 (విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ జానక షర్మిల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం నాకాబంది తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిర్మల్ బైంసా ఖానాపూర్ సారంగాపూర్ కుంటాల కడెం దస్తురాబాద్ కుబీర్ తదితర ప్రాంతాల్లో ఉదయమే వాహనాలను తనిఖీ చేసి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడం జరిగింది అన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా ఎస్పి సాయికిరణ్ నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్ పోలీసులు ఉన్నారు.