28 July, 2026 | 12:58 PM

Breaking News

నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •   కల్లూరులో SIR-2026 అమలుపై సమీక్ష సమావేశం   •   ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమీక్ష   •  

మార్లవాయిలో గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ నూతన సభ్యుల సన్మానం

18-05-2026 03:15 PM

జై నూర్,మే18 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ సభ్యులను సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానితులైన వారిలో సార్ మేడి గేడం గణపత్ రావు, గీతాదర్ ఆత్రం భగవంత్ రావు, రాయి సెంటర్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆడ సోనేరావు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు గొండ్వాన పంచాయతీ రాయి సెంటర్ వ్యవస్థ పటిష్టతకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజం విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ముందుకు సాగేందుకు రాయి సెంటర్ కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, పాలకవర్గ సభ్యులు కనక భరత్, తుంరం సీత, కొడప పుల్లబాయి, తొడసం సర్జబాయి, జూగ్నక ధైర్యవంతి, గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్, పీసా మొబైల్ కనక యాదవ్, అంగన్వాడీ టీచర్ కొడప నెత్తుబాయి, ఆశా వర్కర్ ఆడ చంద్రకళ, ఆత్రం దేవషావ్ పటేల్, సిబ్బంది సోనే రావు, జ్యోతి రామ్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.