26 August, 2026 | 1:29 AM

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

26-08-2026 12:00 AM
  1. పర్యావరణ సమతుల్యతను కాపాడాలి
  2. ముఖ్య అతిథులు
  3. హయత్‌నగర్ కోర్టు ఆవరణలో వన మహోత్సవం

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): హయత్‌నగర్ కోర్టులో మంగళవారం వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.  ముఖ్య అతిథులుగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఫర్ ఇన్ బేగం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె లింగం గౌడ్, జనరల్ సెక్రటరీ వేముల రామ్మోహన్, ఉపాధ్యక్షుడు పంతుల ప్రవీణ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి సాయికృష్ణ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్సై ఫరీద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సూచించారు. దీని ముఖ్య ఉద్దేశం వాతావరణ మార్పులపై పోరాటం మొక్కలు కార్బన్ ఉద్గారాలను తగ్గించి భూతాపాన్ని అదుపు చేస్తాయి మొక్కలు నేలకోతను నివారించి భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి మొక్కల ద్వారా మానవులకు పక్షులకు జీవనాధారం లభిస్తుందన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు వాతావరణ మార్పు అరికట్టడం వర్షపాతం పెంచడం పర్యావరణ రక్షించడం పెంచడం

ఈ కారక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ కోర్టు నజీర్ నరసింహారెడ్డి, మాజీ జనరల్ సెక్రెటరీ సంతోష్ కుమార్ గౌడ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.