ఉప్పల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఎస్‌ఐఆర్
అధికారులకు సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నేతలు
ఉప్పల్, జూన్ 28 (విజయక్రాంతి) : ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టింగ్ రివిజన్ పక్రియ ఉప్పల్ నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుంది. మల్లాపూర్ శక్తి సాయి నగర్ నాచారం డివిజన్ వంటి ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. కాలనీ సంక్షేమ సంఘాలు స్థానిక ఉండే నాయకులు దరఖాస్తు ఫారం నింపే ప్రక్రియ ప్రజలకు వివరి స్తూ ఓటర్ నమోదు కార్యక్రమానికి అధికారులకు స్థానిక నాయకులు సహకారం అందిస్తున్నారు.
ఈనెల 25 నుంచి ప్రారంభమైన సర్వే నెలలో పాటు కొనసాగుతుందని ఈ కార్యక్రమంలో బోగస్ ఓట్లను ఒకటి కన్నా ఎక్కువ ఉన్న ఓట్లను మృతుల ఓటును తొలగించి వాస్తవ ఓటర్లను గుర్తించే కార్యక్రమం ఎస్ ఐ ఆర్ అని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌ఏ పక్రిలో కాంగ్రెస్ బిజెపి టిఆర్‌ఎస్ బిఏల్ ఏ చురుకగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చేనెల జూలై 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు..
పారదర్శక ఓట్ల జాబితానే ప్రజాస్వామ్యానికి ప్రజాపునాది ః నెమలి అనిల్
పారదర్శక ఓట్ల జాబితానే ప్రజాస్వామ్యానికి పునాది అని మల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం రోజున బూతు లెవెల్ ఏజెంట్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విజయవంతంగా చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.






