25 June, 2026 | 5:15 PM

ఏజెన్సీలో సర్ కార్యక్రమం ప్రారంభం

25-06-2026 04:18 PM

ఇంటింటికి బిఎల్ఓ లు. 

ఉట్నూర్, జూన్ 25,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  ఖానాపూర్, అసిఫాబాద్  నియోజకవర్గాల పరిధిలోని  ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ మండలాలతోపాటు  గాదిగూడ, నార్నూర్ మండలాల్లో ని పోలింగ్ బూత్ ఏరియాలో  సర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంటింటికి వచ్చి  బి ఎల్ వో లు  ఎన్నుమరేషన్ ఫారాలు  అందజేశారు.  ఎన్నుమరేషన్  అందజేసి పూర్తి వివరాలను నమోదు చేసి  ఫారంలతోపాటు  ప్రస్తుత ఫోటో అందజేయాలని బి ఎల్ ఓ లు  ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పించారు.

2002  నాటి ఓటరు జాబితాలో  మీ పేరు  అనుసంధానమై ఉంటే దాన్ని అనుసరించి  ఫారంలో  రాసి ఇవ్వాలని  వివరించారు. 2002 ఓటర్ల జాబితాలో  ఉన్న తల్లిదండ్రుల జాబితాను  ఆధారంగా తీసుకోవాలని సూచనలు చేశారు. జాబితాలో ఎక్కడ ఉన్నది వెతికి మరి అనుసానిందిస్తున్నారు. తాము ఇచ్చిన ఫారం ను  తిరిగి ఇవ్వకపోతే స్థానికంగా లేనట్టే భావిస్తామని బి ఎల్ వో లు  ఓటర్లకు వివరిస్తూ తెలుపుతున్నారు. సర్ ఓటర్ల జాబితా  ఎన్నుమరేషన్  ఫారం ల సరఫరా పనితీరుతో పాటు  బి ఎల్ వోలు ఓటర్ల వద్దకు వెళ్తున్నారా లేదా అంటూ ఉట్నూర్ ఆర్డీవో  మోహన్ సింగ్ ఆధ్వర్యంలో   తహసిల్దార్  లు ప్రవీణ్ కుమార్,  రఘునాథరావు,   తుకారంలతోపాటు  రెవిన్యూ సిబ్బంది  కి కేటాయించిన గ్రామాల్లో  బి ఎల్ ఓ ల తో తిరుగుతూ   ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.. ఒకపక్క వర్షాలు  వర్షాలు పడుతుండడంతో  గ్రామాల్లోని ఓటర్లు వ్యవసాయ పనులకు వెళ్తుండడంతో  బి ఎల్ ఓ లకు   ఓటర్లు అందుబాటులో  కలవడం లేదని  బిఎల్వోలు అంటున్నారు.