25 June, 2026 | 6:17 PM

వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు

25-06-2026 04:45 PM

సుల్తానాబాద్, జూన్ 25 (విజయ క్రాంతి):  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి, ఈ  కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో ఉండాలని కోరడం జరిగింది అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోదాటి సాయికిరణ్ , ఉప సర్పంచ్ దాడి తిరుపతి , పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు,  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...