25 June, 2026 | 5:16 PM

ఏజెన్సీలో మొహర్రం ఉత్సవాలు

25-06-2026 04:16 PM

గిరిజనగూడాల్లో అంబరాన్ని అంటుతున్న మొహర్రం సంబరాలు..

ఉట్నూర్, జూన్ 25(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని(Utnoor Agency area) గిరిజన  గ్రామాల్లో మొహర్రం సంబరాలు(Muharram celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. గురువారం గిరిజనగూడాల్లో  పీర్లను ఎత్తుకొని.. డోలాలను మోస్తూ.. డప్పులు వాయిస్తూ ప్రత్యేక నృత్యాలు  చేస్తున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా  గిరిజన గూడాలలోని ప్రజలు భక్తిశ్రద్ధలతో  పీరీలకు.. డోలాలకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒక్క గ్రామం నుండి  మరొక్క గ్రామానికి  మొహరం పండుగ సందర్భంగా  పీరీల తో పాటు డోలాలను తీసుకొని వచ్చిన భక్తులకు అతిథి మర్యాదలు చేస్తున్నారు.

మొహర్రం సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి..