25 June, 2026 | 6:25 PM

తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏంఈఓ కార్యాలయం ముందు ధర్నా

25-06-2026 04:20 PM

బోధన్,జూన్ 25(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతు.... దాదాపు వారం రోజుల నుండి ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతున్నారు. అనే న్యూస్ రావడంతో స్పందించి ప్రైవేట్ స్కూల్ కు వెళ్లి అడగడం జరిగింది, వారు మాకు అమ్మొద్దని అనడానికి మీరు ఎవరు అనడం జరిగింది, విద్యాశాఖ అధికారులు మమ్మల్ని నడపమన్నారని అనడం జరిగింది, వెంటనే ఎంఈఓ కి కాల్ చేసి మాట్లాడితే నాకు  ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మకూడదు అనే గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు అనడం జరిగింది, అవగాహన లేకుంటే వెంటనే అధికారులు ఎంఈఓ ని ట్రాన్స్ఫర్ చేసి వేరే ఎంఈఓ ను, నియమించాలని డిమాండ్ చేశారు.

దీనిపై కలెక్టర్  వెంటనే స్పందించి ప్రైవేట్ స్కూళ్లపైన బుక్స్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతాం డి ఈ ఓ కార్యాలయం కూడా ముట్టడి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు, ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా అధిక రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని కావున మేం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అలాగే ఏదైతే డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పేద మధ్య తరగతి తల్లిదండ్రుల విద్యార్థులు ఉన్నారు వాళ్లకు విచ్చలవిడిగా ఫీజులు  వసూలు చేయడం అలాగే బయట కొంటే బుక్స్ 2వేలు నుంచి 2వేల 500 వందలు వరకు వస్తున్నాయి అన్నారు,

వాటిని ప్రైవేట్ స్కూల్ యజమాన్యం  6వేలు నుంచి 10 వేలు వరకు అమ్మడం జరుగుతుంది, అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం బహిరంగ మార్కెట్ ఎంపిక విద్యశాఖ నిబంధన ప్రకారం స్కూల్ యాజమాన్యాలు తాము సూచించిన పుస్తకాలు బయట మార్కెట్లో దొరికేలా కనీసం మూడు విభిన్న బుక్ స్టాల్స్ పేర్లను తల్లిదండ్రులకు తెలియజేయాలి,  నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారు విచ్చలవిడిగా రేట్లలో అమ్ముతున్నారు కావున దీనిపై వెంటనే ప్రైవేట్ స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, ఎంఈఓ గారికి అవగాహన లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలని, కొత్తగ ఎం ఈ ఓ ని, నియమించాలని కలెక్టర్ గారిని మీడియా ముఖంగా కోరుతున్నాం,   దీనిపైన విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మేం పెద్ద ఎత్తున డిఈఓ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తాం అలాగే కలెక్టర్ కూడా  స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజ్ రతన్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు