పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్, ధర్మారెడ్డి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు నిర్వహించడం జరిగింది.ఈయొక్క సర్ గ్రామసభలో ఓటర్ల యొక్క పేర్లు చదివి వినిపించడం అదే విధంగా నోటీసులు వచ్చినటువంటి వారి పేర్లు కూడా చదివి వినిపించడం జరిగింది. రేపటి నుండి నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు బిఎల్వోలు అందించి ఫొటో తీసుకోవడం జరుగుతుందని, అతి తొందరగా నోటీసులు వచ్చినవారు తిరిగి కావాల్సిన పత్రాలు అందజేయాలని తెల్పడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు మాట్లాడుతూ... ఓటు చాలా అమూల్యమైందని ప్రతి ఒక్కరు ఓటు పోకుండా చూసుకోవాలని బిఎల్వోలకు సహకరించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచులు భూమా యాదగౌడ్,గుల్లపల్లి లక్ష్మీనారాయణ, ఉపసర్పంచులు అభిషేక్, జయరాజ్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటీ కిష్టయ్య,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్, కార్యదర్శులు రమేష్,కార్తీక్, జిపిఓ శంకర్,వార్డ్ మెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.






