28 July, 2026 | 4:25 AM

ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాలు అధికారులకు అందజేత

28-07-2026 12:00 AM

మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ తమ కుటుంబ సభ్యుల ఎన్యుమరేషన్ ఫారాలను అధికారులకు అందజేశారు.

సోమవారం తమ నివాసంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ తో కలిసి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ పుష్పలత, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ కు ఫారాలను అందించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు గోపాల కృష్ణ, వినయ్ పాల్గొన్నారు.