13-02-2026 01:05:00 AM
కిషన్‌రెడ్డి వాదనలు తప్పని తేలితే క్షమాపణలు చెబుతారా?
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : సింగరేణిలో టెండర్లను 2018లో తెచ్చిన నిబంధనల ప్రకా రమే ఆహ్వానించామని, సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో పెడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము వాస్తవాలు చెప్పి న తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడింది తప్పని గ్రహించి క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వంలో నూటికి నూరు శాతం ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, తను ప్రజల అభిప్రాయమే తెలుసుకుంటానని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం నాకు అవసరం లేదు. ఎస్‌ఐబీ ఫిర్యాదుతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఎస్‌ఐబీలో పరికరాల మా యంతో ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ ఇస్తే ఫోన్ ట్యాపింగ్‌తో పాటు విద్యుత్ కొనుగోలు కేసులను కూడా సీబీఐకి ఇస్తాం.
ట్యాపింగ్ కాల్స్ వినడం ఓ మానసిక రోగం.. ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్యు తగ్గుంది’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘తెలంగా ణకు నేను రాజు.. నేనే మంత్రిని.. నాకు ఎవరు పోటీ కాదు’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం బదులిచ్చారు. అధిష్ఠానంతో జరిగిన సమావేశంలో క్యాబినెట్ విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదని ఆయన తెలిపారు.
పదిన్నర ఏళ్లపాటు తాను సీఎంగా ఉంటానని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరగుతాయని, అప్పుడే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి అన్నా రు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు బుల్లెట్ రైలు వచ్చిందని, హైదరాబా ద్‌ను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు హబ్‌గా మారుస్తామని సీఎం పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ప్యూచర్ సిటీ, ఏయిర్‌పోర్టు సమీపంలో 500 నుంచి 700 ఎకరాల భూమి ఇవ్వాలనుకుంటున్నట్లు సీఎం తెలిపారు. మార్చి 31లోపు హైదరాబాద్ మెట్రోను ప్ర భుత్వ టేకోవర్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ వి మానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామన్నారు.
కేసీఆర్ హయాంలోనే అప్పులు..
‘2018లో తెచ్చిన నిబంధనల ప్రకారమే సింగరేణిలో టెండర్లు ఆహ్వానించాం. సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్‌ను అసెం బ్లీలో పెడుతాను. వాస్తవాలు చెప్పిన తర్వా త కిషన్‌రెడ్డి మాట్లాడింది తప్పని గ్రహించి క్షమాపణలు చెప్పాలి. సింగరేణి సంస్థ అప్పు లు మా హయాంలో కాదు.. కేసీఆర్ పదేళ్ల పానలలోనే అప్పులు పెరిగాయి. సింగరేణికి కేసీఆర్ పెట్టిన బకాయిలే ఎక్కువగా ఉన్నా యి.
ఆ విషయం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఎందు కు ఆడగటం లేదు’ అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో వేరే రాష్ట్రం తమకు పోటీ కాదన్నారు. కిషన్‌రెడ్డి పేరు మార్చితేనే దు:ఖపడితే.. నా మత మే మార్చారు కదా? అని రేవంత్‌రెడ్డి అన్నా రు. కిషన్‌రెడ్డి ముమ్మాటికి కేసీఆర్ దత్తపుత్రుడేనని సీఎం ఉద్ఘాటించారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఏమైంది..
‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అధ్యయనం చేయాలని.. ఆ బాధ్యత నిపుణుల కమిటికి అప్పగించాం. మూడు గేట్లు మరమ్మతుల తర్వాత ప్రాజెక్టు కూలితే ఆ నింద తమపై వేయాలని బీఆర్‌ఎస్ చూస్తోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆరునెలల క్రితమే కేంద్రానికి లేఖ రాసినా.. కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు’ అని సీఎం ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతుందో ఆర్థంకావడం లేదన్నారు.
కృష్ణా, గోదావారి బేసినల్‌లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఇచ్చి.. ఆ రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పులేదు కదా అన్నారు. ‘తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తిచేశాక వరద జలాల లెక్కలు తేలుతాయి. నికర జలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టలను ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పకూడదు. కృష్ణా, గోదావరి బేసినల్‌లో నిర్మించే ప్రాజెక్టుల విషయంలో ఒకే విధానం ఉండాలి’ అని సీఎం అన్నారు.
మనుషులను చంపేవాళ్లం కాదు..
కాంగ్రెస్ పార్టీకి హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు.. మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్‌లో ఓ కౌన్సిలర్ స్థానం కోసం హత్యకు పాల్పడుతారా..? అని సీఎం అన్నారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే బీజేపీ.. సీబీఐతో విచారణ జరిపించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
కేసీఆర్ తనకు తానే శిక్ష వేసుకుంటున్నాడు..
రాష్ట్రంలోని అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్లుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌తో పాటు ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే జైలు తప్పదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియాను ప్రశ్నించిన ఈడీ రాష్ట్రంలో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు స్పష్టంగా ఉందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉండి తనకు తానే శిక్ష వేసుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యర్థులే తప్ప శత్రువులు లేరన్నారు. కేసు ఆధారాలు ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లో లేవని స్పష్టంచేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తేనే సింపతి వచ్చిందనడంలో వాస్తవం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అందరు ఒక్కటేనని అన్నారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడని, ఆయన విగ్రహం అమీర్‌పేటలో పెట్టి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తానని తెలిపారు.