13-02-2026 01:06:36 AM
బెజ్జూర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మండలంలోని పాపణపేట్, తలయి, సోమిని గ్రామాల్లో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గ్రామ నర్సరీలను పరిశీలించి ఎర్రమట్టి, నల్లమట్టి, ఇసుక, సూపర్ ఫాస్ఫేట్ను తగిన మోతాదులో కలిపి బ్యాగ్ ఫిల్లింగ్ చేయాలని సూచించారు. ఎర్రమట్టిని జల్లెడ పట్టి కలిపి బ్యాగులు నింపాలని, బెడ్స్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, గ్రామపంచాయతీ భవనం పనులను పరిశీలించారు. గేర్రెగూడెం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. రైతులతో చర్చించి భూమి సమస్యలను పరిష్కరించుకోవాలని గ్రామ సర్పంచ్ సమక్షంలో గ్రామ పెద్దలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజన్న, ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శులు శివాని, పోషాలు, రాజేశ్వర్, టీఏ రాజేష్, ఎఫ్‌ఏ ముక్తాశ్వర్, వినేష్ తదితరులు పాల్గొన్నారు.