30 May, 2026 | 8:33 PM

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ హరిత

30-05-2026 07:23 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కెరమెరి మండలం కొఠారి కొత్తగూడ గ్రామంలో జూన్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. హరిత ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరగనున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, గ్రామంలో స్వాగత తోరణాలు, సమావేశ వేదిక, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఘన స్వాగతం పలికేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఆమెతో పాటు అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్ రావు పాల్గొన్నారు.