20 June, 2026 | 2:53 AM

ఇండ్ల స్థలాల కోసం ఒక్కటైన కొడవలి పార్టీలు

20-06-2026 12:27 AM

ప్రభుత్వం వైఫల్యంతోనే భూపోరాటాలు

హనుమకొండ (మహబూబాబాద్) జూ న్ 19 (విజయక్రాంతి): ఇండ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వ పూర్తిగా వైఫల్యం చెందిందని, అందుకే తాము ఒక్కటై నిలువ నీడలేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల కోసం పోరా టాలు నిర్వహిస్తున్నామని సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ ఎ దుట శుక్రవారం సీపీఐ, సీపీఎం పార్టీల సం యుక్త ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ ధర్నాకు వామపక్షాల నా యకులు, పెద్ద సంఖ్యలో పేద ప్రజలు, మ హిళలు తరలివచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు హాజరై మాట్లాడుతూ భూపోరాటాల ద్వారా ప్రభు త్వ స్థలాలలో గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న, నిరుపేదలైన ప్రజ లకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ప్ర భుత్వం తీవ్రంగా విఫలమైందని ఆయన మ ండిపడ్డారు. ఒకవైపు పేదలకు గూడు లేక ఇబ్బంది పడుతుంటే,

మరోవైపు విలువైన ప్రభుత్వ భూములు ల్యాండ్ మాఫియా పరమవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హనుమకొండ జిల్లాలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇం డ్ల స్థలాల పట్టాలు  పంపిణీ చేయాలని, లేనిపక్షంలో వామపక్షాల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వ ర్గాలు నివసించేందుకు స్థలం లేక, పక్కా ఇ ల్లు లేక, దుర్భర జీవితం గడుపుతున్నారన్నా రు.

అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లస్థలంతో పాటు పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇంకా రాష్ట్ర ప్రభు త్వం దీనిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చే స్తున్నదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. పేదలకు, ప్రభుత్వ భూములలో గుడిసెలు వే సుకుని నివసిస్తున్న

వారికి ఇండ్ల స్థలాలు ఇ చ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల జిల్లా కార్యదర్శులు బిక్షపతి, ప్రభాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి బిక్షపతి, హనుమకొండ మండల కార్యదర్శి స్టాలిన్, కార్యవర్గ సభ్యులు రాములు, లక్ష్మణ్, బిక్షపతి, రాజు గౌడ్, రాజమౌళి, సారంగపాణి, సదానందం, దీన, సిపిఎం జిల్లా నాయకులు చక్రపాణి, వీరన్న, సంపత్, వెంకట్, నిరుపేద గుడిసె వాసులు తదితరులు పాల్గొన్నారు.