20 June, 2026 | 1:40 AM

అంగన్వాడీ భవనానికి నిధులు మంజూరు చేయాలి

20-06-2026 12:26 AM

మేడ్చల్ అర్బన్ జూన్ 19 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గిర్మాపూర్ మున్సిపల్ పట్టణంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ కు మేడ్చల్  పట్టణ బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ డివిజన్ గిర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ ఉన్నటువంటి అంగన్వాడి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు వర్షాకాలంలో వర్షపు నీరు భవనంలోకి చేరి చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఎంపి దృష్టికి తీసుకెళ్లారు.

పట్టణ బిజెపి మాజి అధ్యక్షులు కొండం ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ గిర్మాపూర్ మున్సిపల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న అంగన్వాడి భవనం పూర్తిగా కూలిపోయే స్థితికి వచ్చిందని దాని స్థానంలో నూతన భవనాన్నీ నిర్మించుటకు నిధులు మంజూరి చేయాలని ఎంపి ఈటల రాజేందర్ ను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  బిజెపి సీనియర్ నాయకులు జిల్లా బీజేవైఎం కార్యదర్శి బొజ్జ రాఘవరెడ్డి.వంగేటి హనుమంత రెడ్డి.చీర్ల సత్యనారాయణ.డివిజన్ బిజెపి కార్యదర్శి బండి విష్ణు గౌడ్.బొక్క సురేందర్ రెడ్డి.బూత్ అధ్యక్షులు బండి బాబు గౌడ్.తదితరులు పాల్గొన్నారు.