1 June, 2026 | 10:00 PM

అగ్ని వీర్ కు ఎంపికైన యువకుడిని సన్మానించిన ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి

01-06-2026 09:06 PM

చేగుంట,(విజయక్రాంతి): దేశ రక్షణ దళంలో పనిచేయడానికి  యువత అగ్నివీరికి ఎంపికైన యువకుడిని సర్పంచ్ మాలోత్ ప్రవల్లిక రమేష్ తో కలిసి సన్మానించిన చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, చేగుంట మండల పరిధి సోమ్లా తాండ గ్రామనికి చెందిన గుగ్లోత్  శ్రీను, ను వారికి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను కూడా సన్మానించారు.

ఈ సందర్బంగా ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ... భారత సైనిక దళానికి ఎంపిక కావడం గర్వకారణం అని, కష్టపడి క్రమశిక్షణతో శిక్షణ పొంది  దేశ రక్షణలో భాగస్వాములు కావడం అదృష్టం  భావించి, దేశం సేవ అంకితభావంతో పని చేయాలని అన్నారు,  సర్పంచ్   ప్రవల్లిక రమేష్, మాట్లాడుతూ మా గ్రామం నుండి దేశ సైనిక దళానికి ఎప్పికైనందుకు తాను ఎంత సంతోషిస్తున్నాని  ఇలాంటి గొప్ప స్థాయిలో తమా గ్రామ యువత ఉనందున సంతోషిస్తున్నామని అన్నారు.