ఇందిరమ్మ గృహప్రవేశాలు
01-06-2026 09:08 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): సీతారాంపురం పంచాయతీ వేముకుంట గ్రామంలో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలను నిర్వహించారు. గుగులోత్ వెన్నెల అనిల్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని సీతారాంపురం పంచాయతీ సర్పంచ్ కుంజా రవి ప్రారంభించారు. ఎంపీడీవో రామారావు, ఎంపీఓ రమేష్, హౌసింగ్ ఏఈ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు గ్రామ ప్రజలు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం సందర్భంగా సర్పంచ్ ను, అధికారులను లబ్ధిదారు దంపతులు శాలువాలతో సన్మానించారు.






