27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

తెలంగాణలో శ్యాం స్టీల్ రిటైల్

11-05-2026 02:11 AM

సేవలు ప్రారంభించిన సంస్థ

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్రంలో రిటైల్ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని సంస్థ సోల్ డిస్టిబ్యూటర్ రాఘవ్ ఫ్యూచరిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్య అధినేత దీపక్ వ్యాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న 80 మందికి పైగా ప్రముఖ డీల ర్లు, 20 మంది ఆర్కిటెక్ట్లు, ఇంజనీర్ల సమక్షంలో జూబ్లిహిల్స్‌లో హోటల్ దసపల్లాలో శ్యామ్ స్టీల్ రిటైల్ కార్యాకలాపాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. శ్యామ్ స్టీల్ రిటైల్ కార్యాకలాపాలపై ప్రాంతీయ స్థాయిలో ఉత్సాహా న్ని, విశ్వాసం ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో తమ వ్యాపార విస్తరణకు అనుకూల మైన రిటైల్ కార్యక్రమాలు, అత్యున్నతైన ఉ త్పత్తులకు కట్టుబడి ఉన్నామన్నారు. శ్యామ్ స్టీల్ దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి, మౌలిక వసతుల విస్తరణ లక్ష్యాలను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విస్తరణ పెరిగి బలమైన రిటైల్ చానెల్ వ్యవస్థ ఏర్పడుతుంద న్నారు. ఈ సమావేశంలో శ్యాం స్టీల్ సంస్థకు చెందిన సీనియర్ సభ్యులు జై శంకర్ కుమా ర్, పునీత్ పల్లవ్ తదితరులు పాల్గొన్నారు.