సామాన్యులకు ఓ నీతి.. మంత్రి కొడుకుకు మరో నీతా?
బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): సామాన్య ప్రజలకు ఒక నీతి.. మంత్రి కొడుకుకు మరో నీతి అవలంభిస్తారా అని బీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కొడుకును అరెస్టు చేయాలని డిమాండ్‌చేస్తూ ఆదివారం డీజీపీ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్వీ మెరుపు ధర్నా చేపట్టింది. మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను భర్తరఫ్ చే యాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలుచేశారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు మాట్లాడుతూ.. ఒక బాలిక మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, బాధితురాలు, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా వేధించడం దారుణమన్నారు. బేటీ బచావో అం టూ పెద్దపెద్ద మాటలు చెప్పే బీజేపీ నాయకత్వం, ఇప్పుడు కేంద్రమంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఒక బా లిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి బాధిత కుటుంబానికి అన్యాయం చేస్తున్నాయన్నారు. చట్టం అందరికీ సమానంగా అ మలుకావాలని కోరారు. నిందితుడైన బండి సాయి బగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాల ని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డి మాండ్‌చేశారు. డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, కడారి స్వామి, సతీశ్ సహా నాయకులను పోలీసులు అరెస్ట్‌చేశారు.






