22 May, 2026 | 5:29 PM

అన్నదాతలను ఆదుకోవాలి

22-05-2026 04:51 PM

హైదరాబాద్: అకాల వర్షాలతో రైతులు కల్లాల్లోనే కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాత్రం దొంగ లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేష్ రెడ్డి(Alleti Maheshwar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 80శాతం ధాన్యం కొనుగోలు చేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఆరోపించారు. కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని ఏలేటి మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు.